నోరుజారిన యష్మీ.. సంఛాలక్ అంటే పెద్ద పొడుగా!
on Oct 4, 2024
బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చాడు బిగ్ బాస్. మొదటగా ఆదిత్య ఓం ని ఎలిమినేషన్ చేసి ఆ తర్వాత మెగా ఛీఫ్ కంటెండర్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.
మెగా ఛీఫ్ కంటెండర్ టాస్క్ లో నబీల్ గెలిచాడు. అయితే మొదటగా పృథ్వీ అన్నీ ఫినిష్ చేసుకొని వచ్చాడు కానీ ' ఐ ఆమ్ మెగా ఛీఫ్' అనే లెటర్స్ మధ్య స్పేస్ ఇవ్వకుండానే రెండు సార్లు గంట కొట్టాడు. అయితే పృథ్వీ ఓడిపోయినందుకు విష్ణు కంటే యష్మీనే ఎక్కువ ఫీల్ అయిపోయింది. అసలు పృథ్వీ ఎమోషనల్ అయిన కంట్లో నుంచి నీళ్లు మాత్రం రానివ్వలేదు. కానీ యష్మీ మాత్రం ఏడ్చేసింది. అయితే పృథ్వీ ఓడిపోయినందుకు ప్రేరణయే కారణమంటూ యష్మీ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. ఫ్రెండ్ కాబట్టి సైలెంట్‌గా ఊరుకున్నారా లేకపోతేనా.. సంచాలక్ అంటే పెద్ద పొడుగా.. టూ వీక్స్ నుంచి హేమర్ గేమ్ గురించి అన్ని స్ట్రాటజీలు బొక్కా అని నాతోనే చెప్పింది.. జుజుబీ చిన్నహెల్ప్ చేయలేకపోయిందా పృథ్వీకి.. ఐ తర్వాత స్పేస్ ఇవ్వాలని చెప్పొచ్చు కదా.. సంచాలక్ అయితే చెప్పకూడదా అంటూ నిఖిల్, పృథ్వీల దగ్గర చెప్పింది యష్మీ.
కాసేపటికి యష్మీ దగ్గరికి ప్రేరణ వచ్చి మాట్లాడింది. నువ్వు హెల్ప్ చేసి ఉండాల్సిందంటూ యష్మీ అడుగగా.. సంచాలక్‌గా ఉన్నప్పుడు నేను హెల్ప్ చేయనురా అని కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఎందుకు చేయవు.. అంత ఫాస్ట్ గా ఆడాడు కదా.. చూస్కో అని కూడా చెప్పలేదు.. బెల్ కొట్టాక అయిన చెప్పొచ్చు కదా అంటూ యష్మీ అనగా.. బెల్ కొట్టే ముందే చూస్కోవాలి.. బెల్ కొడితే గేమ్ అయిపోయిందని అర్థం.. నేను ముందు నుండి చెప్తున్నా.. చూస్కోమని కానీ మీరు అరిచే అరుపులతో పృథ్వీ అయిపోయిందని అనుకొని బెల్ కొట్టేశాడంటూ ప్రేరణ నీట్ గా వివరించింది కానీ యష్మీ ఓవారాక్షన్ చేసింది. ఇష్టమొచ్చినట్టు నోరు జారింది. ఈ వీకెండ్ నాగార్జున చేతిలో యష్మీకి మళ్ళీ క్లాస్ పడేలా ఉంది. ఇక కొత్తగా చీఫ్ అయిన నబీల్‌తో మణికంఠ మాట్లాడుతూ.. పులికి వేటాడటం నేర్పించక్కర్లేదు.. అదే పని చెయ్.. అంటు చెప్పాడు.
Also Read